<> ఘటకేసర్ - లింగం పల్లి MMTS ప్రారంభం
<> 12 ఏళ్లు గా ఇక్కడి ప్రజల ఎదురు చూపులు
<> యాదాద్రి MMTS కి లైను క్లియర్ అయినట్టేనా ?
దాదాపు పన్నెండు ఏళ్లుగా ఈ ప్రాంత వాసులు ఎదరు చూస్తున్న ఘటకేసర్-లింగం పల్లి MMTS రైలు ఈ రోజు మన ప్రదాని శ్రీ నరేంద్ర మోడి గారు సంగారెడ్డి లో దృశ్య మాద్యమం ద్వారా ప్రారంబించారు. దీనితో పాటు మౌలాలి – సనత్ నగర్ విద్యుతికరణ, డబల్ లైన్ ను కూడా ప్రారంభిచారు.
ప్రాజెక్టు విషయానికి వస్తే MMTS2 ప్రాజెక్ట్ 2012 లో మొదలైంది. ఘటకేసర్ నుంచి లింగంపల్లి వరకు చర్లపల్లి నుంచి సనత్ నగర్ వరకు ఉన్న బైపాస్ లైను ను ఆధునికరిస్తూ పూర్తి చేయాలి, అలాగే, ఘటకేసర్ నుంచి మౌలాలి వరకు MMTS కొరకు ప్రత్యేకంగా రెండు లైనులు వేయాలి, దారిలో కొత్త స్టేషన్ లు నిర్మించాలి. ఇవ్వన్నీ పూర్తి అయితే, ఘటకేసర్ – లింగంపల్లి (వయా సనత్ నగర్, హైటెక్ సిటీ) , ఘటకేసర్ - ఫలకనుమ (వయా మల్కాజగిరి, సీతాఫలమండి, కాచిగూడ ) ఘటకేసర్ – నాంపల్లి (వయా సికిందరాబాద్) MMTS ట్రైన్ లు అందుబాటులోకి వస్తాయి.
2012 నుంచి నెమ్మది గా సాగుతున్న పనులతో ఇది చాలా ఆలస్యమయింది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయడంలో జాప్యం తో చాలా లేట్ అయింది, ఒక దశలో ఇవి పూర్తి కావడం ప్రశ్నార్థకంగా మారింది. అయితే, చర్లపల్లి స్టేషన్ ను టెర్మినల్ గా అభివృద్ది చేసి ట్రైన్లు ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి అని నిర్ణయించినప్పడు, ఇక్కడి నుంచి నగరంలోకి ప్రయాణికులను తరలించాలంటే MMTS ట్రైన్ లను మొదలుపెట్టడం ఆవశ్యకత గా మారింది, దాంతో ఈ ప్రాజెక్టు మళ్ళీ ఉరకలు వేసింది.
ఈ రోజు కెవలంలో ఘటకేసర్ – లింగంపల్లి ట్రైన్ మాత్రం మొదలు చేశారు, ఇది రేపటి (06-03-2024) నుంచి ప్రతి రోజు కేవలం ఒక ట్రిప్ మాత్రమే నడుస్తుంది. ఇది రెగ్యులర్ ప్రయాణికులకు ఏమాత్రం సంతోషాన్ని ఇవ్వలేదు, కనీసం రోజు 3 లేదా 4 ట్రైన్లు ఈ రూట్ లో నడిస్తే ఉపయోగకరంగా ఉంటుంది అంటున్నారు.
Ghatkesar - Lingampalli MMTS Time Table |
చర్లపల్లి టెర్మినల్ కూడా ఈ రోజు ప్రారంభం కావాలిసింది, అయితే పనులు పూర్తి స్తాయిలో కానందున ప్రారంభం కాలేదని తెలుస్తుంది. టెర్మినల్ ప్రారంభం అయిన తరువాయి ఈ రూట్లో ఎక్కువ MMTS ట్రైన్ లు నడవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి.
ఘటకేసర్ వరకు MMTS రావడంతో ఇక తరువాయి ఘటకేసర్ నుంచి యాదాద్రి వరకు ప్రతిపాదించిన MMTS3 పనులు మొదలు కావచ్చని స్థానికులు భావిస్తున్నారు.
#MMTS2 #GhatkesarMMTS #GhatkesarLingampallyTimeTable #SCR #modi #IndianRailways