యాదాద్రి ప్రధాన ఆలయం చెంత కుక్కల సంచారాన్ని చూసి భక్తులు వీస్తూ పోతున్నారు, ఆలయ నిర్వహణ పై అసంతృపి వ్యక్తం చేస్తున్నారు. ఈ మద్య వివిద మీడియా లలో కుక్కలు చిన్న పిల్లలను కొరికి చంపిన సంఘటనలు, పెద్ద వాళ్ళ పిక్కలు పట్టి ఈడ్చు కెళ్లిన సంఘటనలు చూసైన ఆలయ నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. దాదాపు ఒక డజను కుక్కలు రోజు కొండపై తిరుగాడుతున్నాయని, కొన్నిప్రధాన ఆలయం వరకు వెళుతున్నాయి అని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదాలు జరగకముందే దేవస్థాన అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.