ఆధ్యాత్మిక రాజధాని లో అపరిశుభ్రత


యాదాద్రి కొండ వెనుక రింగ్ రోడ్డు వద్ద చుట్టూ పచ్చని కొండలు, దారి పొడవున ఎత్తుగా ఎదుగుతున్న రకరకాల పచ్చని చెట్లు, పూల చెట్లు, రోడ్డుప్రక్క పాదాచారుల దారి ప్రక్కనే ఏర్పాటు చేసిన గ్రీన్ ల్యాండ్ స్కేప్, యాదాద్రి కొండపైనుంచి వినిపించే వేద మంత్రాలు భక్తులకు కాసేపు ఆగి ఆ ల్యాండ్ స్కేప్ లో కూర్చొని సేద తీరాలనిపిస్తుంది. జరుగుతుంది కూడా అదే, బస్సులకోసం వేచి చూసేటప్పుడు, లేదా తమ తిరుగు ప్రయాణమపుడు కాసేపు సేద తీరి వెళుతున్నారు.  

పందుల స్వైర విహారం :

కానీ, అక్కడ కనిపించే దృశ్యాలు అదికారుల లోపభూయిష్టమైన నిర్వహణకి, నిర్లక్ష్యనికి నిదర్శనాలుగా కనిపిస్తునాయి. ముఖ్యంగా రాజాపేట సర్కిల్, పార్కింగ్ ఏరియా దగ్గర, కొత్త బస్ స్టాండ్ ముందు భాగంలో, లక్ష్మీ పుష్కరిణి చుట్టూరా అపరిశుబ్రత కనిపిస్తుంది, గుంపులు గుంపులుగా పందుల విహారం కనిపిస్తుంది, భక్తులు స్నానమాచరించి బట్టలు ఆరేసుకుంటే, వాటి ప్రక్కనుంచే విహరిస్తూ కనిపిస్తున్నాయి. దాదాపు అన్నీ గ్రీన్ ల్యాండ్ స్కేప్ లలో పందుల విహారం ఉంది, దానికి సాక్షిగా అవి వదిలిన విసర్జనలతో  గ్రీన్ ల్యాండ్ స్కేప్లు అపరిశుబ్రంగా, కంపుగా మారిపోయాయి. గతంలో పలుమార్లు పందుల సమస్య అధికారుల దృష్టి లో ఉన్న ఇంతవరకు ఏ చర్యలు లేనట్టు కనిపిస్తుంది. సాక్ష్యత్తు ముఖ్యమంత్రి గారు తమ మొట్ట మొదటి పర్యటన రోజే కొండపైన పందుల విహారం చూసి దేవస్థానం పరిధిలో ఎక్కడ పందులు కనిపించకుండా చర్య తీసుకోమన్న ఇంతవరకు అధికారులేవరు దానిని సీరియస్ గా తీసుకున్నట్టు లేదు. 



"చెత్త" నిర్వహణ

చెత్తను సేకరించి డంపింగ్ యార్డులకు పంపించాలి, కానీ ఈ ప్రాంతంలో ఎక్కడి చెత్తను అక్కడే కాల్చివేస్తున్నట్టు కనిపిస్తుంది, రోడ్డు పై చాలా చోట్ల చెత్తను కాల్చి వేశారు, కాలిపోగా మిగిలిన చెత్త, బూడిదలతో ఆయా ప్రాంతాలు అపరిశుబ్రంగా ఉన్నాయి. చెత్త నిర్వహణ పై ప్రణాళికా లోపం కనిపిస్తుంది, రింగ్ రోడ్డు పై ఎక్కడ కూడా చెత్త కుండీలు కనిపించవు, ప్రస్తుతం పైన చెప్పిన పార్కింగ్ ఏరియా, బస్టాండ్, పుష్కరిణి ఏరియా లో రోడ్డులోని ల్యాండ్ స్కేపింగ్ ప్రాంతాలో ఎక్కడ చెత్త కుండీలు లేవు, వచ్చిన భక్తులు ప్రయాణికులు వేరే ప్రత్యామ్నాయం లేక చెత్తను అక్కడే వదిలి వెళుతున్నారు, అక్కడ ఎటు చూసిన  వాడి పడేసిన విస్తరాకులు, ప్లాస్టిక్ గ్లాసులు, మద్యం బాటిల్లు కనిపిస్తున్నాయి.
 






ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు పెట్టి యాదాద్రిని ఒక అద్బుతంగా, సుందర ప్రదేశంగా, రాష్ట్ర ఆధ్యాత్మిక రాజదానిగా ప్రపంపచానికి చూపే ప్రయత్నం చేస్తుంది, కానీ ఇక్కడి అదికారుల నిర్వహణ లోపంతో ఇక్కడికి వచ్చి చూసే భక్తులకు విస్తుపోయే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా అదికారులు మేల్కొని నిర్దిష్ట ప్రణాళికా ప్రకారం చెత్త నిర్వహణ, పరిసరాల పరిశుబ్రత నిర్వహణ చేయకపోతే తొందర్లోనే ఇవన్నీ మురికి కూపాలుగా మారిపోతాయని, భక్తులు  స్థానికులు ఆవేదన చెందుతున్నారు, వెంటనే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.





Post a Comment

Previous Post Next Post