||ఆది నుండి సంధ్యాది విధులలో వేదంబయినది విష్ణుకథ ...
నాదించీ నిదె నారదాదులచే వీదివీధులనే విష్ణుకథ..
వినరో భాగ్యము విష్ణు కథ ||
అంటూ, అద్బుతమైన అన్నమాచార్య కీర్తనకు, డా. ఆలేఖ్య పుంజాల బృందం వారి కూచిపూడి నృత్య రూపకం చూశాక మళ్ళీ యాదగిరిగుట్టకు సాంస్కృతిక కళ వైభవం తిరిగి వస్తూంది అనిపించింది. అద్భుతమైన హావ భావ నాట్యకళ తో నర్తకిమనులు ప్రేక్షకులని అలరించారు.
యాదాద్రి పునర్ నిర్మాణం తో, కూల్చివేయబడ్డ కొండ మీది సంగీత భవనం తోనే ఈ ప్రాంతంలో కళా ప్రదర్శనలు దాదాపు కనుమరుగై పోయాయి, అప్పడు ప్రతి బ్రహ్మోత్సవం కు గ్రామంలోని కళ అబిమానులు అందరం కొండపైకి వెళ్ళి రోజు సంగీత కచేరీలు, నృత్యాలు, నాటకాలు, భజనలు చూసేవాళ్ళం, అవి అన్ని దాదాపుగా నిలిచిపోయాయి. ఇప్పటికీ సంగీత భవనం మళ్ళీ ఎక్కడో నిర్మిస్తారో, అసలు నిర్మిస్తారో లేదో కూడా తెలియదు, మళ్ళీ బ్రహ్మోత్సవాల వరకైనా నిర్మిస్తారో లేదో వేచి చూడాలి.
ప్రస్తుతం
YTDA వారు, వైస్ ఛైర్మన్ కిషన్ రావు గారి ప్రత్యేక శ్రద్ద తో దేశీయ
అంతర్జాతీయ స్థాయి కళాకారులను రప్పించి ఈ నాలుగు రోజులు కేవలం సాయంకాలం,
ఆలయ ఉత్తర ద్వారం వైపు, ఆరు బయట (ఓపెన్ థియేటర్) లో దేవస్థానం వారి
సహకారంతో కార్యక్రమాలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఓపెన్ స్టేజ్, ఆదునిక స్టేజ్ లైటింగ్, సౌండ్ సిస్టమ్ అన్ని బాగున్నాయి. కానీ, కొండమీదికి వాహనాలు నిషేదించడం, డైరెక్ట్ బస్సు కాకుండా, పుష్కరిణి దగ్గర దిగి మళ్ళీ బస్సు ఎక్కవలసి రావడం, వివిద కారణాలు, స్థానికులు పెద్ద సంఖ్యలో కొండమీదికి కార్యక్రమాలు చూడడానికి రావడడానికి అవరోదములవుతున్నట్టు తెలుస్తుంది. రానున్న రోజులో ఏమైనా మార్పులు జరుగుతాయో చూడాలి, ఇప్పుడు నిన్నటి ఈ వీడియో చూడండి.
Video Link : https://youtu.be/nEn5G0aI79I
Jhani Mohammed
Editor