పూర్తి కానీ బస్టాండ్ లతో భక్తుల పరేశాన్ | Devotees facing problems with incomplete Bus Stands | Yadadri

 

ప్రణాళిక ప్రకారం యాదాద్రి పునః ప్రారంభం తో పాటే కొండ పైన, కొండ క్రింద గండి చెరువు చెంత రెండు బస్టాండ్ లు ప్రారంభం కావాలి కానీ ఇంతవరకు జరగలేదు. పునః ప్రారంభం తరువాయి యుద్ద ప్రాతిపదికన పూర్తి కావలసిన పనులు ఆలయం ప్రారంభమయ్యి 8 నెలలు గడుస్తున్నా పనులు నత్తనడక నడుస్తున్నాయి. ఫలితం సరిపడా రవాణా సౌకర్యాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం, TSRTC వారు కొండపైకి ఉచిత బస్సులు నడుపుతున్న భక్తులకు సరిపోకపోవడంతో తీవ్ర అసంతృప్తి లో ఉన్నారు. 



కొండపై దాదాపు 20 ప్లాట్ ఫామ్ లతో ఇరువైపులా కట్టిన బస్టాండ్ పనులు ఇంకా పూర్తికాలేదు, ఇదే అదనుగా కొండపై ఉన్న వ్యాపారులు తమ స్టాల్ లను పూర్తికాని బస్టాండ్లోకి మార్చి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. భక్తులు సేద తీరాడానికి, వేచి ఉండడానికి వినియోగించాల్సిన బస్టాండ్ లో ఇప్పుడు కనీసం భక్తులు నిలుచుండడానికి కూడా స్థలం సరిపోవడం లేదు. అదే విధంగా బస్సుల కోసం ఏర్పాటు చేసిన ప్రాంగణం 500 VIP పార్కింగ్ తో సెలవు దినాలలో వాహనాలతో నిండిపోతుంది, కొన్ని సార్లు బస్సులు కూడా తిరగలేని పరిస్థితులు నెలకొంటున్నాయి.

 

కొండ క్రింద గండి చెరువు చెంత నిర్మిస్తున్న బస్టాండ్ కూడా ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు, ఇప్పుడు రంగులు వేసే పని నడుస్తుంది, ఇక్కడ పది ప్లాట్ ఫామ్ లతో బస్టాండ్ నిర్మిస్తున్నారు.  కానీ సెలవు దినాలలో ఇక్కడ చూస్తున్న భక్తులతో ఇది కూడా సరిపోయే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాల నుంచి వచ్చే బస్సులు, కొండపైకి తిరిగే బస్సులతో ఈ కొత్త బస్టాండ్ ఎలా ఉండబోతుందో భవిష్యత్ లో చూడాలి, గత దసరా కు ప్రారంభిస్తారని వార్తలు వచ్చాయి, కానీ జరగలేదు. ఇప్పడు సంక్రాంతి వరకు పనులు పూర్తి చేసి ప్రారంభిచాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ ప్రాంతంలో  నిర్దిష్టమైన బస్టాండ్ లేక పోవడంతో ఏ బస్సు ఎక్కడ ఆగుతుందో, ఏ బస్సు ఎక్కి పోవాలో తెలియక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, దారి పొడుగున బస్సుల కోసం వేచి చూస్తున్నారు, వృద్దులు, పిల్ల తల్లులు, ఇబ్బందులు పడడం తరుచూ చూడాల్సి వస్తుంది. 


సమయానికి రాని బస్సులతో, సరిపడా లేని బస్సుల తో విసిగిన భక్తులు కాలినడకన ఘాట్ రోడ్డు నుంచి కొండ పైకి, క్రిందికి వెళుతున్నారు, కనీసం ఇటు వైపు ఒక మెట్ల దారి నిర్మించిన భక్తుల కు సౌకర్యంగా ఉండేది కానీ అటువంటి ప్రయత్నాలు ఏవి కనిపించడం లేదు.    

Post a Comment

Previous Post Next Post