కాంక్రీట్ మిక్సర్ లారీ బోల్తా, పలువురి కి గాయాలు

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో ఒక్కటి ఒక్కటిగా వెలుగుచూస్తున్న నాణ్యతలెమీ పనులు ఒక వైపు అయితే, నిర్మాణ సమయంలో తగిన రక్షణ చర్యలు కూడా తీకుకోవడం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

ఇటీవల కురిసిన వర్షాలకు మొదట్లో మూడవ కొత్త ఘాట్ రోడ్ కొట్టుకోపోగా, మొన్న కురిసిన వర్షానికి యాదాద్రి మొదటి ఘాట్ రోడ్డు గోడ కూలి పోయింది, వెంటనే ఈ ప్రదేశంలో మరమ్మత్తు పనులను అదికారులు చేపట్టారు. ఈ  ప్రదేశంలో శ్రామికులు పని చేస్తుండగా  సిమెంట్ మిక్సర్ లారీ ఘాట్ రోడ్ మీదినుంచి క్రిందికి బోల్తా పడింది. అక్కడే పనిచేస్తున్న పలువురి శ్రామికులకు గాయాలయ్యాయి., ఒకరి పరిస్థితి విషమం గా ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. .

వేలాది మంది భక్తలు వచ్చిపోయే దారుల్లో ప్రత్యేక సంరక్షణ చర్యలు, భవిష్యత్ లో నిర్మాణ లోపాలు లేకుండా నాణ్యత చర్యలు తీసుకోవలసిన అవసరముంది, లేకుంటె యాదాద్రి దేవస్థానం పేరు మరింత ఆబాసు పాలయ్యే అవకాశాలున్నాయి. 



Post a Comment

Previous Post Next Post